కార్గిల్ విజయ్ దివస్‌పై రామకృష్ణ మఠం ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్: కార్గిల్ విజయ్ దివస్ సంబరాల సందర్భంగా రామకృష్ణ మఠం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ఈ మేరకు ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ డైరెక్టర్ స్వామి బోధమయానంద ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 25న వర్చువల్ విధానంలో నిర్వహించనున్న సదస్సుకు కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ నవీన్ నాగప్ప, అమర జవాన్ మేజర్ పద్మపాణి ఆచార్య కుమార్తె అపరాజిత ఆచార్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 11.00 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చర్చ, క్విజ్ కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిందిగా స్వామి బోధమయానంద చెప్పారు.

https://forms.gle/iV1zSjouAwy71bBdA

 

https://www.facebook.com/permalink.php?story_fbid=10160206789649252&id=668304251

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*