రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

హైదరాబాద్, నిజామాబాద్: తెలంగాణలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో గురుపూర్ణిమ సందర్భంగా ఉదయం 7 గంటలకు విశేష పూజ, ఉదయం 8 గంటలకు భజనలు, 10:45కు హోమం నిర్వహించారు. 11 గంటలా 15 నిమిషాలకు స్వామి శితికంఠానంద ప్రసంగించారు. ఆధ్యాత్మిక జీవితంలో గురువు యెక్క ప్రాముఖ్యతను చెప్పారు.

 

ఉదయం 11:40కి ముండకోపనిషత్తు నూతన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి జ్ఞానదానంద ప్రసంగించారు. గురువు ప్రాధాన్యత గురించి వివరించారు.

మధ్యాహ్నం 12:05 నిమిషాలకు విశేష హారతితో తొలివిడత కార్యక్రమాలు పూర్తయ్యాయి. అనంతరం భక్తులకు భోజన ప్రసాదం ప్యాకెట్లలో అందించారు. సాయంత్రం 5:40కి స్వామి బోధమయానంద ప్రతి శనివారం నిర్వహించే భగవద్గీతపై వ్యాఖ్యానం కొనసాగింది. సాయంత్రం 6:45కు ఆరాత్రికం నిర్వహించారు. రాత్రి 7గంటలా 15 నిమిషాలకు భక్తులు ప్రత్యేక భజనలు చేస్తూ భక్తిసాగరంలో మునిగితేలారు.

 

 

మరోవైపు నిజామాబాద్‌లోని రామకృష్ణ సేవా సమితి గంగస్థాన్ రామకృష్ణ ధ్యాన మందిరంలో గురుపూర్ణిమ ఉత్సవాల సందర్భంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమితి వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త సముద్రాల నరసింహా చారి ప్రసంగిస్తూ గురువు లేని జీవితం సార్థకం కాలేదన్నారు. గురువు ఆశీస్సులతో మనిషి ముక్తి పొందవచ్చని చెప్పారు. గురుపౌర్ణమి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్యానంతో పాటు సత్సంగం కొనసాగింది. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి దీరెన కుమార్, సభ్యులు కిషోర్ యాదవ్, గంగా ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్, తోట రాజశేఖర్, సమన్వయకర్త వసంత్ పాటిల్, ఇతర భక్తులు పాల్గొన్నారని సమితి అధ్యక్షులు సాయి ప్రసాద్ తెలిపారు.

నిజామాబాద్ గాయత్రీ నగర్ రామకృష్ణ ఆశ్రమంలోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ కూడా సముద్రాల నరసింహా చారి ప్రసంగించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*