
చెన్నై: దేవుళ్ల బొమ్మలను వేయడంలో తాదాత్మ్యం పొందే మాధవి బాలసుబ్రమణ్యం గిన్నీస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. చిన్నప్పటినుంచి డ్రాయింగ్ అంటే ఉన్న ఇష్టాన్ని అభిరుచిగా మార్చుకుని ప్రస్తుతం దేవతా చిత్రాలను ఉన్నది ఉన్నట్లుగా గీయగలిగే స్థాయికి చేరుకున్నారు. అమెరికాకు చెందిన సంస్థలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తూనే బొమ్మలు వేయడంలో మెళకువలు నేర్చుకున్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆర్ట్ వేయడంలో ఆరితేరారు. ఎవ్వరి దగ్గరా శిక్షణ పొందకుండానే అలవోకగా ఆర్ట్ వేయగలుగుతున్నారు. ఎలాంటి కమర్షియల్ ఒప్పందాలు కుదుర్చుకోకుండా కేవలం ఆత్మ సంతృప్తి కోసమే బొమ్మలు గీస్తున్నారు. ఆల్‌రౌండర్‌గా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మాధవి బాలసుబ్రమణ్యం ఈక్షణం టీమ్‌తో ముచ్చటించారు.
ఆమె మాటల్లోనే…
నా పేరు మాధవి బాలసుబ్రమణ్యం. నేను పుట్టింది గుంటూరు జిల్లా మంగళగిరి. మా నాన్న గారి పేరు పెళ్లరి(pelluri) శ్రీనివాసరావు, అమ్మ గారి పేరు శివకుమారి. నాన్న గారు ఉద్యోగరీత్యా నా చదువు అంతా విశాఖపట్నంలో జరిగింది. నాన్న గారు సింహాచలం దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా చేసి రిటైర్ అయ్యారు. అమ్మ సంస్కృత లెక్చరర్‌గా చేశారు.
https://www.facebook.com/madhavipelluri/posts/10226087253591881
నేను విశాఖపట్నంలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎలెక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. చిన్న చిన్న బొమ్మలు వేసే దానిని. కాని ఎక్కువ వేసే సమయం వుండేది కాదు. కాలేజీలో కూడా నేను టాపర్‌ను. మా అత్తయ్య గారి ఊరు నెల్లూరు. పెళ్లి అయ్యాక మా వారి ఉద్యోగరీత్యా చెన్నై వచ్చేశాను. మా ఆయన దగ్గర గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోని, గ్రాఫిక్ డిజైనర్‌గా అమెరికా కంపెనీకి వర్క్ చేస్తున్నాను. మాకు ఒక అబ్బాయి.
https://www.instagram.com/p/CNayhFAjUA2/
ఆర్ట్ నేను ఎక్కడా నేర్చుకోలేదు.నిజం చెప్పాలంటే నా గురువు ఆ దేవుడే. ఎందుకంటే చూసింది చూసినట్లు వేసే శక్తిని ఇచ్చాడు. అందుకే నేను నా ఆర్ట్‌ని ఆయనకే అంకితం చేయాలని దేవుడి బొమ్మలే వేస్తున్నాను. మన భారత దేశంలో వున్న అన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ వేయాలనేది నా కోరిక.
https://www.facebook.com/madhavipelluri/posts/10225916963374732
మా వారు మరియు మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2020 మే నుంచి ఆర్ట్ వేయటం మొదలు పెట్టాను.అందరి ప్రోత్సాహంతో 2020 దసరా నుంచి పోటీలలో పాల్గొని ఇప్పటి వరకు 60 దాకా బహుమతులు మరియు అవార్డులు గెలుచుకున్నాను. ఇవన్నీ ఆ దేవుడి వలే వచ్చాయి కనుక ఆయనకే అంకితం ఇస్తున్నాను.
Congratulations Madhavi Balasubramanyam for Winning 1st Position in our Ratha Yatra Art & Craft Contest 2021
Category – Charcoal/Penart#artcompetition #art #artist #artcontest #artwork #drawing #painting #artistsoninstagram #competition
#artoftheday #sketch #spenowr pic.twitter.com/2zwRYPuKwY— Spenowr (@spenowr) August 10, 2021
గిన్నీస్లో చోటు దక్కించుకోవడంపై…
నా ఆర్ట్‌తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవాలనే కోరిక వుండేది. అది ఇప్పుడు నిజం అయింది. ఇప్పుడు నా పేరు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఉందని చెప్పడానికి చాలా ఆనందంగా వుంది. గిన్నీస్ రికార్డ్స్ వారు ఆన్లైన్ ద్వారా చేపట్టిన వన్ అవర్ ఆర్ట్ ఈవెంట్లో
మొత్తం 112 దేశాల నుంచి 1200 మంది పాల్గొన్నారు. ఇందులో 797 మందిని మాత్రమే గిన్నీస్ వారు ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో నేను కూడా వున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గిన్నీస్ రికార్డ్స్ వారు సర్టిఫికెట్లు, మెడల్స్ పంపించారు.
https://www.facebook.com/madhavipelluri/posts/10225657705653451
https://www.instagram.com/p/CPG993GD-_Q/
మాధవి బాలసుబ్రమణ్యం మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఈ క్షణం టీమ్ మనసారా కోరుకుంటోంది.
Be the first to comment