
హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం నుండి నూతనంగా ఎన్నికైన సభ్యుడు నోముల భగత్‌తో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ భవనంలోని సభాపతి చాంబర్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనసభ్యులు గ్యాదరి కిషోర్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును నోముల భగత్ కు అందించారు.
Be the first to comment