జాతీయ పతాకంపై గీతం స్ఫూర్తిదాయకం- కిషన్ రెడ్డి

హైదరాబాద్: స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ’ ఆజాది కా అమృత మహోత్సవాలు‘‘ దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న తరుణంలో జాతీయ పతాకంపై దేశభక్తి గీతాన్ని వీడియో రూపంలో తీసుకొని రావడం స్ఫూర్తిదాయకమని కేంద్ర సాంస్కతిక పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివద్ది శాఖా మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. కాచిగూడకు చెందిన ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ డీఆర్‌ఎస్ నరేంద్ర ఆద్వర్యంలో రూపొందించిన దేశభక్తి గీతం సీడీని ఆయన సోమాజీగూడలోని దిల్ కుషా అతిథి గృహంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ ఉజ్వల ఘట్టాలు, స్వాతంత్య్ర పోరాట యోధులు, చారిత్రక ఘనత, కళా-వారసత్వ వైభవం, వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవటం భారతీయుల అందరి కర్తవ్యమని అన్నారు. మనం ఆనందంగా స్వేచ్ఛగా ఉండేందుకు ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. రాబోవు తరాల కోసం, భారతమాత స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం బలిదానాలు చేసి జైలుపాలైన పోరాట యోధులను స్మరించుకొనే ఆలోచనతో నరేంద్ర రూపొందించిన గీతం స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. జాతీయ పతాకం కులమతాలు, వర్గ, వర్ణాలకు అతీతమైందని, కోట్లాది భారతీయుల ప్రతీకైన జాతీయ పతాకం ఔనత్యం తెలిపే విధంగా పాట ఉందంటూ నరేంద్రను అభినందించారు. ఇదే కార్యక్రమంలో నరేంద్ర ద్వారా నిర్వహించబడుతున్న వీ39 యూట్యూబ్ ఛానెల్ లోగోను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. వీ39 యూట్యూబ్ ఛానెల్లో ఈ గీతాన్ని ప్రజలు వీక్షీంచేందుకు ఉంచినట్లు నరేంద్ర వివరించారు.

D R S Narendra

 

కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, దర్శకులు ఫాల్గున్, విష్ణువర్ధన్ తో పాటు బీజేపి నాయకులు మారేపల్లి శ్రీకాంత్, సామల ఓంకార్, బైరుకొండ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*