తపస్వీ (పులిజాల) కవిత్వం… అపురూపం

అపురూపం

శిల లెరుగని శిల్పమా!
కవులెరుగని అందమా!!
ఏకొమ్మ పూచిందో!
ఏతావి నొదిగిందో!
ఎవరి చేరువౌతుందో!
ఎంతకాలం వుంటుందో!! “శిలలె”

కనులకు నీవే కాదంబరి!
మనసుకు నీవే మనోరంజని!
మధురమైన కావ్యంలో
మరపురాని నాయిక!
నిర్మల హృదయము లో
నీలాకాశ తారక!
మనసు మనసు పులకితలో
వికసించిన స్వప్నిక! “శిలలె”

చిత్రాని కే చిత్ర విచిత్రానివి!
మమతకు నీవే మరో రూపానివి!
అరువది నాల్గుకళల
అనురాగ మాలిక!!
కలహంస నడకల
కల్యాణ గీతిక !!
సృష్టి లయ విన్యాసాల
సుందరా దీపికా!!
శిలలెరుగని శిల్పమా!
కవులెరుగని అందమా!!
–తపస్వీ (పులిజాల)

(92465 28339)

విద్యార్థులకు ప్రియమైన మాస్టారు కిష్టయ్య

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎడ్యుకేషన్ లెక్చరర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా సమర్థుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు లెక్చరర్ కిష్టయ్య వేలాదిమంది డిఈడీ, బిఈడీ, టీపీటీ విద్యార్ధులు తెలుగు పండిట్లయ్యేందుకు కారణమయ్యారు. విద్యార్ధులను అమితంగా ప్రేమించి… వారు జీవితంలో స్థిరపడేందుకు అన్నివిధాలా సహకరించే మనస్తత్వం ఆయనది. గాయకుడు కూడా కావడంతో తరగతి గదుల్లో కిష్టయ్య సార్ జానపదాలను విద్యార్ధులు తెగ ఎంజాయ్ చేసేవారు. నిలువెల్లా మధురత్వాన్ని నింపుకున్న కిష్టయ్య సార్ క్లాసుల కోసం విద్యార్థులు ఉత్సాహంగా ఎదురుచూసేవారు. విద్యార్థులకు ప్రియమైన మాస్టారైన కిష్టయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిత్వం రాయడంలోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. కిష్టయ్య రాసిన కవిత్వాలు, రచనలు ఈక్షణం పాఠకులకు ప్రత్యేకం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*