
యుద్ధం – జీవనం
……………………
ఎక్కడ అబద్ధాలు
నిజంపై స్వారీ చేస్తుంటాయో ……
ఎక్కడ సత్యం హత్య చేయబడి
ఆత్మహత్యగా చిత్రీకరించబడుతుందో…….
ఎక్కడ రాబందులు,
శవాలుగా మారే మనుషుల కోసం ఎదురు చూస్తుంటాయో ….
ఎక్కడ తరతరాలుగా నీడనిస్తున్న చెట్టుకే
నిలువ నీడ లేకుండా చేసే కుట్ర జరుగుతుందో …….
ఎక్కడ జీవులకు వనాలకు జీవమిచ్చే
జీవనదిని విదీర్ణం చేసి, చూర్ణం చేసేస్తుంటారో ……
ఎక్కడ కిలకిలారావాలు సైతం
మనోభావాలకు విఘాతం గా భావించబడతాయో …..
ఎక్కడ అలలనూ, అలలవంటి పిల్లల కలలనూ
చిదిమేసేందుకు రంగం సిద్ధం చేయబడుతుందో …….
అక్కడ నేను నిలబడి ఉన్నాను …..
జీవనం సాగిస్తున్నాను
స’జీవ’ జీవన ధర్మాన్ని బతికించేందుకు
జవసత్వాలు నింపేందుకు, ప్రయత్నిస్తున్నాను …..
ధరాతలంపై భరతమాతను
విశ్వగురువుగా నిలబెట్టేందుకు
పోరాడుతున్నాను ….
రక్తమోడుతున్నాను…
నాతో వచ్చేదెవరో
వచ్చి నిలిచేదెవరో
చివరికి గెలిచేదేవరో……
– హసన్ముఖి, హైదరాబాద్
చాలా బాగుంది