దూరదర్శన్ స్ట్రింగర్ల ఎంపిక కోసం నోటిఫికేషన్

ప్రసార భారతి నియమకాలు 2021

దూరదర్శన్ స్ట్రింగర్ల ఎంపిక కోసం నోటిఫికేషన్

హైదరాబాద్, సెప్టెంబర్ 2, 2021 : హైదరాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తల విభాగం స్ట్రింగర్ల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద తేదీ నుండి రెండేళ్లపాటు కొనసాగుతారు. ప్రస్తుతం పని చేస్తున్న స్ట్రింగర్‌లు కూడా ఈ కొత్త ఎంపానెల్‌మెంట్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను 30.09.2021 సాయంత్రం 5 గంటలలోపు హైదరాబాద్‌ రామాంతపూర్‌లోని దూరదర్శన్ కేంద్రానికి పోస్ట్ ద్వారా లేదా స్వయంగా అందించవచ్చు. స్ట్రింగర్ల ఎంపికకు కావలిసిన విద్యార్హత, అనుభవం, ఎంపిక విధానం తో పాటు పుర్తి వివరాల కోసం ప్రసార భారతి అధికారిక వెబ్‌సైట్‌ లేదా http://prasarbharati.gov.in/pbvacancies లింక్ ద్వారా పొందవచ్చు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*