5వ అంతర్జాతీయ భాగవత జయంతి ఉత్సవాలకు అనూహ్య స్పందన

సింగపూర్ : తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో సింగపూర్ నుండి 5వ అంతర్జాతీయ భాగవత జయంత్యుత్సవములు ఆన్ లైన్ పద్దతిలో ఫేస్ బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా ఘనంగా నిర్వహించబడినవి. ఐదున్నర గంటలపాటు పాటు నిర్వహించబడిన ఈ ప్రత్యక్ష ప్రసారానికి అనూహ్య స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలియచేసారు. సెప్టెంబరు 4, 2021 నాడు జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమము, పలు భాగవత పద్యాలు, కీర్తనలు, పద్య కథనాలు వంటి ప్రదర్శనలతో అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ అలరించింది. ఈ వేడుకలలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో పిల్లలు నమోదుచేసుకోగా, వారి నుండి ఎంపికైన 75 మంది పిల్లల ప్రదర్శనలు ప్రత్యక్షప్రసారం చేశారు. సింగపూర్, భారత దేశములనుండే కాక అమెరికా,  మలేషియా దేశాల నుండి కూడా పిల్లలు పాల్గొని కార్యక్రమానికి వన్నె తెచ్చారు. చిన్నారులలో మన సాంస్కృతిక విలువల మీద ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి, చిన్నారులు మౌర్య మరియు మనుశ్రీ ఆకునూరి వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులందరినీ అలరించారు. రమ్య భాగవతుల, నమ్రత దేవల్ల వారికి సహకారం అందిస్తూ పిల్లలని మరింత అలరించారు.

 

ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి పలువురు గురువులు పిల్లలకు తమ తమ సంస్థల ద్వారా పాటలను, పద్యాలను నేర్పారు. ముఖ్యంగా ప్రముఖ నేపథ్య గాయకులు నేమాని పార్థసారథి (కీర్తన అకాడెమీ ఆఫ్ మ్యూసిక్), షర్మిల (మహతి అకాడెమీ), కిడాంబి విక్రమాదిత్య  (ముకుందమాల బృందం), విద్య కాపవరపు (విద్య సంగీతం అకాడెమీ) అపర్ణ ధార్వాడ తమ విద్యార్థుల ప్రతిభకు గత రెండు నెలలుగా సానపెట్టి ఈ కార్యక్రమంలో ప్రదర్శనకు తయారు చేసారు. అలాగే, ఈ కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్, మల్లిక్ పుచ్చా  వంటి ప్రముఖులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు.

ఈ అంతర్జాల భాగవత జయంత్యుత్సవములు చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన RK వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని)లకు భాగవత ప్రచార సమితి తరపున నిర్వాహకులు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియచేసారు. చివరగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులందరికి, ముఖ్యంగా నిర్వహణ కమిటీ సురేష్ చివుకుల, నమ్రత దేవల్ల, రమ్య బొమ్మకంటి, రవితేజ భాగవతుల, విద్యాధరి కాపవరపు, మౌర్య ఊలపల్లికి ధన్యవాదములు తెలిపారు.

Links:

https://www.facebook.com/PotanaTeluguBhagavatham/videos/571032597421389

Photos: https://drive.google.com/drive/folders/1z9j8Ik6tijPXF0XQk3OjbiPkje42GvEr?usp=sharing

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*