
హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జ్ఞాన పరంపరలో ఉన్న ఆదర్శ ఉపాధ్యాయుడి లక్షణాలను బేలూర్ మఠ్లో ఉన్న రామకృష్ణ మిషన్ వివేకానంద రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సెక్రటరీ స్వామి ఆత్మప్రియానంద వివరించారు. భారతీయ గురు పరంపరలో ఆచార్యులు పరమశ్రేష్టమైన పంచ గుణములు కలిగి ఉండేవారని చెప్పారు.
1} శ్రోత్రియం 2} బ్రహ్మనిష్టం 3} అవర్జిన 4} అకామాతః 5} పరమకారుణిక
1} శ్రోత్రియం : ఆచార్యులు వేదవిదుడై , బ్రహ్మ సూత్రములు మరియు ఉపనిషత్తుల సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండవలెను . తన విద్యార్థులకు అతి సరళముగా ఉపదేశము చేయవలెను . ప్రతి విద్యార్ధి లోను నిగూఢమైన శక్తిని వెలుపలికి తీయవలెను . వారి అభివృధికి తోడ్పడవలెను .
2} బ్రహ్మ నిష్టం :– బ్రహ్మ జిజ్ఞాసియై , అత్యంత నిష్ఠ కలవాడై పర అపర విద్యలను తెలిసిన వాడై ఉండి తన విద్యార్థులకు ధర్మ అధర్మ ము లను భోదించవలెను . వారి సందేహములను నివృతి చేయవలెను . ఎప్పుడు ఉత్సహముగా , ఉత్తేజముగా భోదించవలెను . శ్రీ కృష్ణడు చాల మంచి ఉపాద్యాయుడు . అతనిని ఆదర్శముగా తీసుకొని బోధించవలెను.
3} అవృజిన : ఆచార్యుడు నిష్కలంక వంతుడై, నిష్పాపవంతుడై , సుగుణ శీలము కలవాడై విద్ద్యను బోధించవలెను.
“ నహి జ్ఞానేన సదృశం పవిత్రం మిహావిద్యతే”. జ్ఞానము పరమ పవిత్రము. దానిని అమ్ముకొనుట మహా పాపము. వ్యాపార దృష్టితో కాక సమాజ శ్రేయస్సు కొరకై జ్ఞానము అందించవలేను .
4} అకామతహ:– ఆచార్యుడు ధనము నందు గాని పేరు ప్రఖ్ఖ్యాతులందుగాని కోరిక లేని వాడై ఉండవలెను . బిరుదులకు ,ప్రశంశలకు లొంగని వాడై తన వృత్తి యందు నిష్ఠ గలవాడై ఉండవలెను. పక్షపాతము లేక నిస్వార్థ ముగా శిక్షణ ఇవ్వవలెను .
5 } పరమకారుణికః . దయ గుణము కలవాడై విద్యార్థులలో ఆసక్తి పెంచేవాడై ఉండవలెను.
అదే విధముగా విద్యార్ధి కూడా అత్యంత వినయము కలిగినవాడై శ్రోధ భక్తులతో గురువు గారి దగ్గరికి వెళ్లి సాష్టాంగ నమస్కారము చేసి విద్యనార్జించవలెను.
తద్విజ్ఞానార్థం స గురు మేవాభి గచ్చేత్
సమిత్ పానిహి శ్రోత్రియం బ్రహ్మణినిష్టం.
భారతీయ విద్యా విధానం యెంతో శ్రేష్టమైనదని, విలువలతో కూడినదని పేర్కొన్నారు . స్వామి వివేకానందుని దృష్టిలో, మనిషిలోని అంతర్గత జ్ఞానాన్ని అభి వ్యక్తం చేసేదే నిజమైన విద్య. విద్య అంటే మెదడులోకి చొప్పించే సమాచార రాశి కాదని తెలిపారు. ఈ విధంగా ప్రతి ఉపాధ్యాయుడు పంచ గుణాలను అలవర్చుకొని ఆదర్శ్ ఉపాధ్యాయుడుగా మారాలని ఆత్మప్రియానంద హితవు పలికారు. ఆన్లైన్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో జూమ్ ద్వారా వీఐహెచ్ఈ ఫ్యాకల్టీ సభ్యులు, భక్తులు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ రామకృష్ణార్పణమస్తు … రవీంద్రనాథ్ (వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ వాలంటీర్ ఫ్యాకల్టీ)( 90001 54702)
Be the first to comment