వేద వ్యవసాయం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయి‌పేట మండలం పోతమ్‌శెట్‌పల్లి గ్రామంలో శ్రావణ్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అర ఎకరంలో నల్లబియ్యం (కృష్ణ వ్రీహీ) పండిస్తున్నాడు. కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్  (86867 43452) సలహా మేరకు వేద వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. శ్రావణ్ రెడ్డి నల్లబియ్యం పండిస్తున్న పొలాన్ని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని, మాసాయిపేట ఎంపీడీఓ ఉమాదేవి సందర్శించారు. వేద వ్యవసాయం ద్వారా ఎలాంటి రసాయనాలు వాడకుండా పంట పండించే తీరును అడిగి తెలుసుకున్నారు. పంట మొత్తాన్నీ పరిశీలించారు. శ్రావణ్ రెడ్డిని మెచ్చుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వేద వ్యవసాయం ప్రారంభించిన కౌటిల్య కృష్ణన్ అనేకమంది రైతులను నల్లబియ్యం పండించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సనాతన వరిబీజంగా పేరున్న కృష్ణవ్రీహీకి మార్కెట్‌లో డిమాండ్ అధికంగా ఉంది. కృష్ణ వ్రీహీలో పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో విదేశాల్లో సైతం వీటికి డిమాండ్ ఉంది. రైతులు తొలుతగా తమ కుటుంబం తినేందుకు కృష్ణవ్రీహీ పండించుకోవాలని, తద్వారా ఆరోగ్యంగా ఉండాలని కౌటిల్యకృష్ణన్ సూచిస్తున్నారు.

https://www.facebook.com/kautilya.krishnan/posts/140941338185594

రైతులు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుందనే సత్సంకల్పంతోనే కృషిభారతం ద్వారా వేద వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్లు కౌటిల్య కృష్ణన్ తెలిపారు. ఇప్పటికే అనేక మంది రైతులు ముందుకు వచ్చి నల్లబియ్యం పండిస్తున్నారని, మున్ముందు మరింత మంది అన్నదాతలు కృష్ణవ్రీహీ పండించేందుకు ముందుకు వస్తారని కౌటిల్య ఆశాభావం వ్యక్తం చేశారు.

https://www.facebook.com/KrishibharathamTrust/posts/118807813619366

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*