జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంతో కృషి భారతం అవగాహనా ఒప్పందం

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంతో కృషి భారతం ఎంఓయూ

తిరుపతి: వేద వ్యవసాయంపై పరిశోధనల్లో విజయవంతమైన కృషి భారతంతో తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ మురళీధర్ శర్మ,  రిజిస్ట్రార్ కమాండర్ చల్లా వెంకటేశ్వర్, అకడమిక్ వ్యవహారాల డీన్ రాణి సదాశివమూర్తి, శ్రీ వెంకటేశ్వరా ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ పి.మురళీకృష్ణ, కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్, అటల్ ఇన్‌కుబేషన్ సెంటర్ సిఈఓ డాక్టర్ శివకిరణ్, డాక్టర్ రమ సమక్షంలో ఈ ఎంఓయూ కుదిరింది.

 

కృషిభారతం చేపట్టిన

వేదాల ఆధారంగా వ్యవసాయం,

ఎలాంటి రసాయనాలూ వాడకుండా వ్యవసాయం చేయడం,

వృషభోత్సవాల ద్వారా ప్రజల్లో దేశీయ వృషభాలు, గోవుల ప్రాముఖ్యతను సెమినార్ల ద్వారా తెలియజేస్తుండం,

పంటపొలాల సందర్శనల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేస్తుండటం,

దేవతా వృక్షాలు నాటడం,

సనాతన వరి వంగడం నల్లబియ్యం (కృష్ణ వ్రీహీ) పండించడమే కాకుండా

తెలుగు రాష్ట్రాల్లో రైతులు కూడా వేద వ్యవసాయం ఆధారంగా నల్లబియ్యం పండించేలా

కౌటిల్య కృష్ణన్ ప్రోత్సహిస్తున్న విషయాలను తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అభినందించింది.

https://www.facebook.com/KrishibharathamTrust/posts/118807813619366

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*