మాసిన మమత- పులిజాల(తపస్వి) కవిత్వం

*మాసిన మమత**

వ్యథలన్నీ కథలుగా
కన్నీళ్లతో వ్రాస్తున్న
బ్రతుకంతా బరువుగా
బాధ్యతతో ఈడుస్తున్న
మానసిక గాయాలే
గేయాలుగా పాడుతున్న
మాసిన మమతలతో
జ్ఞాపకాల వీధులు తిరుగుతున్న
నమ్మక ద్రోహిగా ముద్రవేసుకొని
ఆత్మద్రోహానికి తలపడుతున్న
ఆశలేని మనస్సులో
హాలాహలాన్ని దాచుకొని
ఏదిలేని స్థితిలో
విధిని నమ్ముకొని జీవిస్తున్న
అలలు అలలుగా
కలత కలలు కంటూ
కన్నీటి సాగరాన
సంసారనౌక నడుపుతున్న
తుఫాను అలజడి హోరులో
తుదిశ్వాసకై ఎదురుచూస్తున్న

—-పులిజాల(తపస్వి)

 

విద్యార్థులకు ప్రియమైన మాస్టారు కిష్టయ్య (92465 28339)

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎడ్యుకేషన్ లెక్చరర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా సమర్థుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు లెక్చరర్ కిష్టయ్య వేలాదిమంది డిఈడీ, బిఈడీ, టీపీటీ విద్యార్ధులు తెలుగు పండిట్లయ్యేందుకు కారణమయ్యారు. విద్యార్ధులను అమితంగా ప్రేమించి… వారు జీవితంలో స్థిరపడేందుకు అన్నివిధాలా సహకరించే మనస్తత్వం ఆయనది. గాయకుడు కూడా కావడంతో తరగతి గదుల్లో కిష్టయ్య సార్ జానపదాలను విద్యార్ధులు తెగ ఎంజాయ్ చేసేవారు. నిలువెల్లా మధురత్వాన్ని నింపుకున్న కిష్టయ్య సార్ క్లాసుల కోసం విద్యార్థులు ఉత్సాహంగా ఎదురుచూసేవారు. విద్యార్థులకు ప్రియమైన మాస్టారైన కిష్టయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిత్వం రాయడంలోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. కిష్టయ్య రాసిన కవిత్వాలు, రచనలు ఈక్షణం పాఠకులకు ప్రత్యేకం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*