
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వ సభ్యసమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. విశ్వ వేదికపై నుంచి పాకిస్థాన్, చైనాలకు చురకలంటించారు. ఆఫ్ఘనిస్థాన్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలనుకునేందుకు కొన్ని దేశాలు యత్నించాలనుకోవడం అవివేకమని చెప్పారు. పరోక్షంగా పాకిస్థాన్, చైనాలపై విమర్శలు కురిపించారు. ఆఫ్ఘనిస్థాన్లో మైనార్టీలను కాపాడాల్సిందేనంటూ ఆయన మైనార్టీలను లేకపోతే ఐక్యరాజ్యసమితి విశ్వసనీయతపైనే అనుమానాలు తలెత్తుతాయని చెప్పారు. చాణుక్యుడి మాటలను మోదీ తమ ప్రసంగంలో ఉటంకించారు.
Here is why the words of the wise Chanakya hold true today, especially in the context of the UN. pic.twitter.com/80jJB6tyC9
— Narendra Modi (@narendramodi) September 25, 2021
UN సర్వ సభ్యసమావేశంలో మోదీ భారత ప్రజాస్వామ్య గొప్పతనం గురించి చెప్పారు. చిన్నప్పుడు చాయ్ అమ్ముకున్న పిల్లాడు నేడు భారత ప్రధాని అయ్యాడని, భారత్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందనడానికి ఇదే గొప్ప ఉదాహరణ అని చెప్పారు.
Yes, Democracy Can Deliver.
Yes, Democracy Has Delivered. pic.twitter.com/XNiCFn9v2s
— Narendra Modi (@narendramodi) September 25, 2021
కోవిడ్-19పై పోరులో భాగంగా తొలి డీఎన్ఏ వ్యాక్సిన్ తయారీ భారత్లోనే తయారౌతోందని ప్రధాని మోదీ సగర్వంగా ప్రకటించారు. 12 ఏళ్లు పైబడినవారందరికీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విశ్వవేదికపై నుంచి భారత శాస్త్రవేత్తల కృషిని మోదీ కొనియాడారు.
I invite the world- Come, Make Vaccines in India! pic.twitter.com/ODsbsHyU7o
— Narendra Modi (@narendramodi) September 25, 2021
భారత్ అభివృద్ధి చెందితే మిగతా ప్రపంచమంతా అభివృద్ధి చెందుతుందని మోదీ చెప్పారు.
When India grows, the world grows.
When India reforms, the world transforms. pic.twitter.com/8o6RTkVjyb
— Narendra Modi (@narendramodi) September 25, 2021
Be the first to comment