
న్యూఢిల్లీ: హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ ఉంటుంది. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు చేపడ్తారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
Schedule for Bye-elections in Parliamentary/Assembly Constituencies of various States – poll date 30.10.21https://t.co/6UCZji9fej
— Spokesperson ECI (@SpokespersonECI) September 28, 2021
టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచారు. అయితే బీజేపీ ఈటల రాజేందర్‌ను బరిలో దించుతుందా లేక ఆయన భార్య పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ అభ్యర్ధిని కూడా ఇంకా ప్రకటించలేదు. అన్ని పార్టీల అభ్యర్ధులు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.
This post is also available in : English
Be the first to comment