
హైదరాబాద్: క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ రన్ నిర్వహించనుంది. ఈ నెల 10న ఉదయం ఆరున్నర గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వద్ద ఈ రన్ నిర్వహించనున్నారు. వర్చువల్ విధానం ద్వారా కూడా రన్లో పాల్గొనే అవకాశం కల్పించారు. 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21.1 కిలోమీటర్ల పరుగులో పాల్గొనవచ్చు. దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలైన సందర్భంగా ఆజాదీకా అమృతోత్సవ్ వేళ ఎన్ఎండీసీ పార్ట్నర్గా గ్రేస్ కేన్సర్ పౌండేషన్ ఈ రన్ నిర్వహిస్తోంది. పరుగులో పాల్గొనే ఔత్సాహికులు కేన్సర్‌పై అవగాహన పొందడమేకాక బహుమతులు కూడా గెలుచుకోవచ్చని గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్నబాబు చెప్పారు. 120 దేశాల్లో క్యాన్సర్‌పై అవగాహన రన్ నిర్వహిస్తున్నామని డాక్టర్ చిన్నబాబు చెప్పారు.
Chinnababu Sunkavalli
పేర్లు నమోదుకు కింది లింక్‌లను క్లిక్ చేయండి.
మరిన్ని వివరాలకు..
https://www.facebook.com/chinnababu.sunkavalli/posts/10157895007216923
Be the first to comment