
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో అక్టోబర్ 9న సింగపూర్లో బతుకమ్మ వేడుకలను జూమ్ ద్వారా ఘనంగా నిర్వహించారు. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మిస్ యూనివర్స్ సింగపూర్ 2021గా గెలిచిన తెలుగు అమ్మాయి నందిత బన్నను సొసైటీ సభ్యులు సత్కరించారు. కోవిడ్ నిబంధనల కారణంగా 40 చోట్ల చిన్న సమూహాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ దుబ్బాక బీజేపీ శాసన సభ్యుడు రఘు నందన్ రావు లైవ్ లో సొసైటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ను అభినందించారు. సుమారు 13 సంవత్సరాల నుంచి సింగపూర్లో బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
సంబరాలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి TCSS కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Telangana Cultural Society (Singapore)
ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి టీసీఎస్ఎస్ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి లక్ష్మణ్ రాజు కల్వ, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, సునీత రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, మరియు కార్యవర్గ సభ్యులు, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, నడికట్ల భాస్కర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్,శివ ప్రసాద్ ఆవుల, ప్రవీణ్ మామిడాల, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, రవి కృష్ణ విజాపూర్ ధన్యవాదాలు తెలిపారు.
Basika Prashanth Reddy
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సంతోషి కూర వ్యవహరించారు. సంబురాలకు సమన్వయకర్తలుగా సునీత రెడ్డి, రోజా రమణి, జూలూరు పద్మజ, గర్రేపల్లి కస్తూరి, నర్రా నిర్మల, రాధిక, రోహిత లావు వందన వ్యవహరించారు.
Be the first to comment