ఎన్ఎమ్‌డీసీ గ్రేస్ క్యాన్సర్ రన్ 2021ను ప్రారంభించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఎన్ఎమ్‌డీసీ గ్రేస్ క్యాన్సర్ రన్ 2021’ పేరుతో నిర్వహించిన రన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రారంభించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన రన్‌గా భావిస్తోన్న ఈ రన్‌లో 120 దేశాల నుంచి వర్చువల్‌గా, నేరుగా 70 వేల మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ వేళ ‘క్యాన్సర్ నుంచి విముక్తి’ నినాదంతో ఈ రన్ నిర్వహించారు. క్యాన్సర్ లేనటువంటి ప్రపంచం కోసం ఎదురు చూస్తున్నామని ఎన్ఎమ్‌డీసీ, సీఎమ్‌డీ సుమిత్ దూబె చెప్పారు.

ఏ రోగి కూడా ఆర్థిక లేమి కారణంగా చికిత్సను కోల్పోకూడదనే నినాదంతో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఈ రన్‌ను ప్రారంభించింది. రన్ నుంచి సమీకరించిన నిధులు దేశ వ్యాప్తంగా ఉన్న మారుమూల గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్‌ ను అందించడానికి, క్యానర్స్‌తో బాధపడుతున్న అవసరమైన రోగుల సంరక్షణకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా క్యాన్సర్‌పై అవగాహన, ప్రపంచవ్యాప్తంగా పరిజ్ఞానాన్ని వ్యాప్తి చెయడం వంటి కార్యక్రమాలను వర్చువల్‌గా నిర్వహిస్తారు.

క్యానర్స్ పై అవగాహన కలిగించాలని నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించిన చిన్న కార్యక్రమం నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక అపూర్వమైన ఉద్యమంగా మారినందుకు చాలా సంతోషంగా ఉందని గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సీఈవో, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు అన్నారు. క్యాన్సర్‌ను గుర్తించడం, చికిత్స ఆలస్యం కాకుండా ప్రజలను చైతన్య పరచడం ఎన్‌ఎమ్‌డీసీ గ్రేస్ క్యాన్సర్ 2021 ఉద్దేశమని చెప్పారు. ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ధ్వనించేలా నేటి రన్ చేసిందన్నారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*