ద్వాపరయుగంలో బలరాముడు ఆచరించిన వృషభోత్సవం… మళ్లీ ఇప్పుడు

నవంబర్ 5న వృషభోత్సవం

హైదరాబాద్: కృషి భారతం ఆధ్వర్యంలో నవంబర్ 5న తెలుగు రాష్ట్రాలతో పాటు వివిద దేశాల్లో వృషభోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి ఏటా కార్తీక శుద్ధ పాడ్యమి నాడు వృషభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అని, వేద వ్యవసాయ పండుగల్లో వృషభోత్సవం అతి ముఖ్యమైనదని కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ తెలిపారు. దేశవాళీ వృషభాల ప్రాధాన్యతను ప్రస్తుత తరాలకు తెలియజేయడమే కాక గో సంతతిని కాపాడుకునే లక్ష్యంతో వృషభోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.

బసవ, పరాశర, పరశురామ, కశ్యప, వశిష్ట, బలరాముడు తదితరులు గతంలో వృషభాన్ని పూజించారని కౌటిల్య గుర్తు చేశారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా వృషభోత్సవాన్ని తమ మఠాలు, పీఠాలు, ఆశ్రమాల్లో నిర్వహించేందుకు అనేక మంది స్వాములు ముందుకొచ్చారు. అనేక దేవాలయాలు, గోశాలల్లో కూడా వృషభపూజ, వృషభయాత్ర నిర్వహించనున్నారు. రైతన్నలు కూడా వృషభోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమౌతున్నారు. మరిన్ని వివరాలకు కృషి భారతం కార్యాలయాన్ని (86867 43452) సంప్రదించాలని కౌటిల్య తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*