వృషభోత్సవానికి భూమిపుత్ర సంపూర్ణ మద్దతు

www.eekshanam.com: కృషి భారతం ఆధ్వర్యంలో నవంబర్ 5న తెలుగు రాష్ట్రాలతో పాటు వివిద దేశాల్లో నిర్వహించనున్న వృషభోత్సవానికి భూమిపుత్ర ఫౌండేషన్ మద్దతు తెలిపింది. వేద వ్యవసాయ పండుగైన వృషభోత్సవాన్ని రైతులంతా ఉత్సాహంగా జరుపుకోవాలని భూమిపుత్ర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వోడపల్లి నవీన్‌కుమార్, ఉపాధ్యక్షుడు అఖిల్ వర్మ పిలుపునిచ్చారు. దేశీయ వృషభాలను కాపాడేందుకు కృషిభారతం చేస్తున్న కార్యక్రమాలను వారివురూ అభినందించారు. దేశవాళీ వృషభాల ప్రాధాన్యతను ప్రస్తుత తరాలకు తెలియజేసేందుకు కృషిభారతం అధ్యక్షుడు కౌటిల్య కృష్ణన్‌ చేస్తున్న కృషిని వారిద్దరూ ప్రశంసించారు.

 

ప్రతి ఏటా కార్తీక శుద్ధ పాడ్యమి నాడు వృషభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అని, గో సంతతిని కాపాడుకునే లక్ష్యంతో ఏటా వృషభోత్సవం నిర్వహిస్తున్నామని కౌటిల్య తెలిపారు.

బసవ, పరాశర, పరశురామ, కశ్యప, వశిష్ట, బలరాముడు తదితరులు గతంలో వృషభాన్ని పూజించారని కౌటిల్య గుర్తు చేశారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా వృషభోత్సవాన్ని తమ మఠాలు, పీఠాలు, ఆశ్రమాల్లో నిర్వహించేందుకు అనేక మంది స్వాములు ముందుకొచ్చారు. అనేక దేవాలయాలు, గోశాలల్లో కూడా వృషభపూజ, వృషభయాత్ర నిర్వహించనున్నారు. రైతన్నలు కూడా వృషభోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమౌతున్నారు.

రైతన్నలు వృషభాలతో ఫొటోలు దిగి 86867 43452 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని కౌటిల్య సూచించారు. రైతులు తమ పేరు, అడ్రస్ వివరాలు కూడా ఫొటోలతో పాటు పంపాలని చెప్పారు. బెస్ట్ సెల్ఫీలకు బహుమతులుంటాయని కౌటిల్య చెప్పారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌లు కూడా పంపిస్తామన్నారు.

 

వృషభోత్సవానికి ఇప్పటికే కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మద్దతు తెలిపారు. వృషభోత్సవం పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*