ఈ నెల 30న ‘శ్రీ లలితావిద్య’ ఆవిష్కరణోత్సవం

www.eekshanam.com: ఋషిపీఠం ఆధ్వర్యంలో అక్టోబర్ 30న హైదరాబాద్ కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో ‘శ్రీ లలితావిద్య’ ఆవిష్కరణోత్సవం జరగనుంది. సాయంత్రం ఆరు గంటలకు నాట్యగురువులు నూతి లక్ష్మిప్రసూన బృందంచే ‘వన్ దే శ్రీమాతరం’ పేరుతో ప్రత్యేక ‘శివపద’ నృత్యంతో కార్యక్రమం ప్రారంభం కానుంది. ‘భాగవతవిరించి’ డా. టి.వి. నారాయణరావు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. కాంచీపురం కంచికామకోటిపీఠం శ్రీకార్యం ఏజెంట్, చల్లా విశ్వనాథశాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. ‘మధురభారతి’ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గ్రంథ సమీక్ష చేస్తారు. ‘జ్ఞానానందనాథ’ గోటేటి శ్రీనివాసరావు ప్రథమప్రతిని స్వీకరిస్తారు. గ్రంథకర్త ‘సమన్వయసరస్వతి’ సామవేదం షణ్ముఖశర్మ హృదయావిష్కారం చేస్తారు.

https://www.facebook.com/SriSaamavedam/posts/432384951579106

శ్రీ లలితసహస్రనామస్తోత్రంపై సామవేదం షణ్ముఖశర్మ వివిధ భాష్యాలను పరిశీలించి, గురు-దేవతానుగ్రహం చేత స్ఫురించిన భావాలను మేళవించి ప్రవచనాలుగా అనేకచోట్ల చెప్పిన వాటిని ఒక గ్రంథంగా శ్రీ లలితావిద్య రూపొందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*