
హైదరాబాద్: రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్- సైనిక్‌పురిలోని భవన్స్ వివేకానంద కాలేజీతో కలిసి 2021- జాతీయ స్థాయి యువ నాయకత్వ సదస్సు నిర్వహించనుంది. ఈ నెల 30న ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది.
అమర్ భారత్ కా అమృత్ మహోత్సవ్ వేళ నిర్వహిస్తున్న ఈ వెబినార్‌లో ప్రాచీన భారత దేశంలో విద్యా వ్యవస్థ పునాది, ప్రాధాన్యతపై వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎడ్యుకేషన్ డైరక్టర్ స్వామి బోధమయానంద ప్రసంగిస్తారు. ప్రాచీన భారత దేశంలో విద్య అనే అంశంపై కోయంబత్తూరుకు చెందిన అమృత విశ్వవిద్యాపీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోద్ కుమార్ ప్రసంగిస్తారు. ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
https://www.instagram.com/p/CVYLxiQvWt7/?utm_medium=share_sheet
Be the first to comment