నమస్తే సేట్ జీ – ఫ్రంట్ లైన్ వారియర్స్ టీజర్ ని విడుదల చేసిన  తలసాని

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పైన తల్లాడ శ్రీనివాస్, మహంకాళి దివాకర్, తల్లాడ సునీల్ కలిసి నిర్మిస్తున్న సినిమా
“నమస్తే సేట్ జీ”- ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేది ట్యాగ్ లైన్.

తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయికృష్ణ, మోనా, స్వప్న చౌదరి, తల్లాడ వెంకన్న లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ యాక్షన్ టీజర్ ని మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా విడుదల చేపించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ టీజర్ ని చూసి టీం అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ లాక్డౌన్ లో కీలకపాత్రలు పోషించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ అంశాల్ని కథలో ఎంచుకొని ఈ సినిమా తీయడం జరిగింది. అందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న ఈ సినిమా లో ఒక పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాడు, అందుకు సంబంధించిన యాక్షన్ టీజర్ ని దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. యాక్షన్ టీజర్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది,
సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ టీజర్ విడుదల చేయగానే అందరి దగ్గర నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది, ఈ దీపావళి పండుగ అందరి కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని కోరుతున్నట్లు తెలియజేసారు.

ఈ చిత్రానికి ఫైట్స్ – శ్యామ్ కరదా, టీజర్ ఎడిట్- వివేకానంద విక్రాంత్,
సౌండ్ ఎఫెక్ట్స్ – వెంకట్ అందిచారు,
పి.ఆర్.ఓ – పవన్ పాల్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*