
హైదరాబాద్: సమాచార భారతి ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో గోల్కొండ సాహితీ ఉత్సవం జరగనుంది. భారతీయ సాహిత్యం, సంస్కృతి సంప్రదాయాలు, కళలలను ప్రొత్సహించడమే లక్ష్యంగా దీన్ని నిర్వహిస్తామని ఉత్సవ కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ తెలిపారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఈ లిటరరీ ఫెస్ట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో రెండురోజుల పాటు పలు రకాల సదస్సులు ఉంటాయి. నగరంలోని సాహిత్యాభిమానులు, పుస్తక ప్రియులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కేశవ మెమోరియల్ విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ అన్నాదానం సుబ్రహ్మణ్యం, సమాచార భారతి కార్యదర్శి ఆయుష్, సీనియర్ జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be the first to comment