
ఢిల్లీ: కరోనా సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేసిందని రాష్ట్రపతి కోవింద్ వ్యాఖ్యనించారు. గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన 51వ గవర్నర్ల సమావేశంలో ప్రధాని మోదీతో కలిసి ఆయన పాల్గొన్నారు.గవర్నర్ల సమావేశాలకు అధ్యక్షత వహించడం రాష్ట్రపతి కోవింద్ కు ఇది నాల్గోసారి . ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
రాష్ట్రపతి కోవింద్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ “2 ఏళ్ళ సుదీర్గ విరామం తరవాత మనం కలుస్తున్నాం, కోవిడ్-19ను జయించటానికి మన కరోనా యోధులంతా అంకిత భావంతో పని చేసారు, నేడు 108 కోట్లకు పైగా టీకలను వేసి కరోనా యుద్దంలో ముందున్నాము ” అని అన్న ఆయన కరోనా పోరాటంలో ప్రపంచ దేశాలకూ భారత్ సహాయపడిందన్నారు.
Be the first to comment