
ముంబయి: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వ్యాఖ్యలతో మరో వివాదంలో చిక్కుకుంది. ఓ సమావేశంలో మాట్లాడుతూ దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014 లో వచ్చిందని 1947 లో వచ్చిన స్వాతంత్య్రం భిక్ష (భీక్) అని వ్యాఖ్యానించారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కర్యనిర్వహన చైర్మన్ ప్రీతి మీనన్ తనపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కంగనా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆప్, రనౌత్ పై భారత శిక్షా స్మృతి లోని 504, 505,124A సెక్షన్ ల మేరకు దేశద్రోహం కేసులు నమోదుచెయ్యలని కోరింది.
ఈ నటి వ్యాఖ్యలను వరుణ్ గాంధీ సైతం విమర్శించడం గమనార్హం, “కొన్ని సార్లు మహాత్మా గాంధీ త్యాగాలను కించపరచడం, మరి కొన్ని సార్లు ఆయన హంతకున్ని గౌరవించటం, ఇప్పుడు మంగళ్ పాండే నుంచి భగత్ సింగ్ వరకు లక్షల మంది స్వతంత్ర యోధుల త్యాగాలను కించపరచడం. ఇలాంటి ఆలోచనల్ని పిచ్చితనం అనాల..? దేశద్రోహం అనాలా..?” అని సామాజిక మాధ్యమంలో ఆయన వ్యాఖ్యానించారు.
Be the first to comment