“మా పూర్తి సహకారం ఉంటుంది”- కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

గురువారం టైమ్స్ సమిట్ 2021లో పెగసెస్, నూతన ఐటీ నిబంధనలపై ఐటీ శాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

ఢిల్లీ: పెగసెస్ విచారణ కోసం సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమటీకి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

విచారణ కోసం అవసరమయ్యే సదుపాయాలనీ, ప్రయోగశలల్ని, సమాచారాన్ని కమిటీకి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

నూతన ఐటీ నిబంధనల పై:

గురువారం టైమ్స్ సమ్మిట్ 2021 లో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలను నియంత్రించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. ప్రజల భావాలను వ్యక్త పరచే స్వేచ్ఛ సామాజిక మధ్యమల వల్ల లభించినా వాటి దుర్వినియోగాన్ని ఆపడానికి నిబంధనలు అవసరమని,వ్యక్తిగత గోప్యత, సామాజిక బాధ్యతల మధ్య సంతులనం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యక్తి గత నియంత్రణ ప్రభుత్వ ఉద్దేశం కానీ స్వేచ్ఛని నియంత్రించడం కాదని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు.

ఈ సంవత్సరం మొదట్లో కేంద్ర ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*