
దుబాయి: రెండు జట్లూ సెమీస్ లో ఓటమి తో పోరాడి ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఈ జట్లలో ఎవరు టీ-20 విశ్వ విజేతలవుతారని ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. 12 దేశాలు, 44 మాచులు, దాదాపు నెల నాల్లు సాగిన టోర్నీ చివరి దశకు చేరుకుంది.
ఫించ్ నేతృత్వంలోని ఆసీస్ 2015 నుంచి ఒక్క ఐసీసీ టోర్నమెంట్ గెలవలేదు కాగా విలియంసన్ కెప్టెన్సీ లో న్యూజీలాండ్ 2019 వరల్డ్ కప్ లో రన్నర్ అప్, తాజాగా జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతలుగా నిలిచారు. టీ-20 ల్లో మాత్రం న్యూజీలాండ్ పై ఆస్ట్రేలియా నే మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
గ్రూప్ స్టేజ్ లో చక్కన బోలింగ్ ప్రదర్శన చేసిన కీవిస్ అదే స్థాయి ప్రదర్శన ఆశిస్తోంది. గాయం కారణంగా డేవన్ కన్వే జట్టు కు దూరం అవ్వడం ఆస్ట్రేలియా కి కలిసొచ్చే అంశం.
డేవిడ్ వార్నర్, మాథ్యూ వెడ్ లతో పాటు అడం జంపా, స్తోయినిస్ చక్కని ప్రదర్శన కనబరుస్తుoడటం ఆసీస్ కి కలిసొచ్చే విషయం.
బ్యాటింగ్ కి అనుగుణంగా ఉండే దుబాయ్ పిచ్ చక్కని అల్ రౌండ్ ప్రదర్శన చేసిన జట్ల కే విజయాన్ని అందిస్తూ వచ్చింది.
వీవీఎస్. లక్ష్మణ్, షేన్ వార్న్, కెవిన్ పీటర్సన్ లాంటి మాజీలు అందరూ ఆస్ట్రేలియా కే గెలుపు అవకాశలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. కానీ ఆట ముగిసేదాక గెలుపెవరదో చెప్పడం కష్టం.
Be the first to comment