ప్రభుత్వం అసలు ధాన్యం ఎందుకు కొనుగోలు చేస్తుంది ?

హైదరాబాద్ : ఇటీవల రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య చర్చలలో ప్రధానమైన అంశంగా ఆహారధాన్యాలు కొనుగోలు చేయడం. ఐదు ఏళ్ల కు సరిపోయే ధాన్య నిల్వలు ఉన్నాయని, ఈసారికి ధాన్యాన్ని కొనుగోలు చేసెది లేదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియ తేల్చి చెప్పడంతో ఈ చర్చకు దారితీసింది.
భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో మనకు చాలినన్ని ఆహారధాన్యాలు లేవు. దేశ ప్రజల ఆహార అవసరాలను తీర్చే స్థాయిలో ఉత్పత్తి లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లం, గోధుమలను కూడా. కాబట్టి, అలాంటి పరిస్థితులలో ఆహారధాన్యాలు కొని, నిల్వ ఉంచి, కృత్రిమ కొరతను సృష్టించి, ధరలు పెంచి, ప్రజల ఆహార భద్రతకు ప్రమాదం తేకూడదు గనుక, ప్రభుత్వం కొనుగోలు చేయడం మొదలైంది. ఆహారధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డ్ ఉన్న వారికి, రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం మొదలైంది. ఎన్ని పంటలకు కనీస మద్దతు ధర ఉన్నప్పటికీ, వాస్తవికంగా, ప్రభుత్వం కొంటున్నది గోధుమలు, వరి అది కూడా పూర్తిగా ఎక్కడ కొనరు.
వరి విషయం లో కేవలం దేశంలో పండించిన మొత్తంలో 29 శాతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరిస్తుంది. ఇది గోధుమలలో అయితే 45 శాతం గా ఉంది. పంజాబ్, హర్యాన లో అత్యధికంగా కొంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మధ్యస్థం గా ఉంది. మిగిలిన రాష్ట్రాలలో అతితక్కువ గా కొంటున్నారు. అందుకే కొంచెం గమనిస్తే, అక్కడే పెద్ద ఎత్తున రైతు ఉద్యమం సాగుతోంది. సేకరణ లక్ష్యం, బాగా పంట పండి మార్కెట్లో సప్లై పెరిగితే, అప్పుడు ధరలు తగ్గిపోయి, రైతు దెబ్బ తీస్తాడు. కరువుకాటకాల వల్ల లేదా ఇతర పరిస్థితుల వలన, బ్లాక్ మార్కెట్ లో ధరలు పెరిగి వినియోగదారుడు దెబ్బతింటాడు. అంటే అటు రైతుకు ఆదాయ భద్రత కల్పించాలి. ఇటు వినియోగదారుడికి ఆహార భద్రత ఇవ్వాలి. ఈ లక్ష్యంతో దేశంలో స్వాతంత్రం వచ్చాక, అగ్రికల్చర్ కాస్ట్ ఎండ్ ప్రైస్
కమిషన్ ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధర నిర్ణయించి, ఆ ధరకు మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలో కొంత భాగాన్ని కొనడం మొదలు పెట్టారు. దీనివల్ల ధరల స్థిరీకరించబడుతాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శీతల గిడ్డంగుల్లో దాచి అవసరమైనప్పుడు విడుదల చేస్తారు. ఎక్కువైతే ఎగుమతి చేస్తారు. మధ్య దళారులు పోతారనేది దీని అర్థం.
ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలంటే, ప్రభుత్వం కొనుగోలు చేసి భద్ర పరచాల్సిందే. దీనివల్ల మార్కెట్లో ధరలు నియంత్రణలో ఉంటున్నాయి. భారతదేశంలో 135 కోట్ల మంది ప్రజలు ఆహార కొరత ఏర్పడితే, ప్రపంచంలో ఆహార కొరతను ఎవరు తీర్చలేరు. చిన్న దేశం అయితే దిగుమతుల మీద ఆధారపడవచ్చు. కానీ, దేశంలో మెజారిటీ ప్రజల అవసరాలు తీర్చడానికి దిగుమతుల మీద ఆధారపడితే ప్రపంచ మార్కెట్లో డిమాండ్ సప్లై తేడా వచ్చి విపరీతంగా ధరలు పెరుగుతాయి. అందుకొరకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అనే విధానం తీసుకొచ్చారు.
– అనిల్ కుమార్, హైదరాబాద్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*