ఈ నెల 24న శ్రీ అరబిందో సిద్ధి డే కార్యక్రమాలు

హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో ఈ నెల 24న శ్రీ అరబిందో సిద్ధి డే కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉదయం ఎనిమిదిన్నరకు మార్చ్‌ఫాస్ట్‌తో ఈ కార్యక్రమాలు ప్రారంభమౌతాయి. రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరక్టర్ స్వామి శితికంఠానంద ప్రసంగం అనంతరం శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌ విద్యార్ధులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

శ్రీ అరబిందో ఓ స్వాతంత్ర్య సమర యోధుడు, జాతీయవాదిగా కన్నా మహర్షిగా, ఆధునిక భారత దేశ కవిగా ఎక్కువ ప్రాచుర్యం పొందారు. ఆయన ఆధ్యాత్మిక ప్రస్థానం కూడా చాలా మందికి తెలియదు. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో మునుపెన్నడూ విననటువంటి తపస్సు, యోగాలను ఆయన సాధన చేశారు. సమున్నతమైన ఆధ్యాత్మిక విజయాన్ని సాధించేందుకు ఆయన చేసిన చివరి ప్రస్థానం ప్రారంభానికి ముందు ఆయనకు అనేక వేదాంత సంబంధమైన అనుభవాలు సొంతమయ్యాయి.

శ్రీ అరబిందో పుదుచ్చేరిలో 1910 నుంచి 40 ఏళ్ళపాటు కఠోర తపస్సు చేశారు.1926 నవంబరు 24న ఆయనలో శ్రీకృష్ణ తత్వం సంపూర్ణంగా వ్యాపించింది. అందుకే నవంబరు 24ను సిద్ధి డేగా పేర్కొంటారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*