
ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ & శ్రీ ఆరోబిందో ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో, మా గురు ప్రముఖ పాత్రికేయులు శ్రీ నారాయణ రావు గారి సహారంతో’ శ్రీ అరబిందో 150వ జయంతి’ వేడుకల్లో నా యువ జర్నలిస్ట్ మిత్రులతో కలసి పాల్గొనడం జరిగింది.
శ్రీ అరబిందో ఘోష్ మహర్షి అందరికీ ఆదర్శప్రాయుడు!
శ్రీ అరబిందో ఘోష్ గొప్ప కవి, పండితుడు, తత్వవేత్త, స్వాతంత్ర్యయోదులు.
అరభిందో పుట్టింది 1872 కలకత్తా, 1879 లో ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. బాల్యం, విద్య అభ్యాసం అంత ప్రచ్యతాప దేశాల్లో అయిన అతను తను పుట్టిన నెల మీద మమకారంతో తిరిగి భారత దేశానికి 1893 లో వచ్చారు. అరభిందో తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి భారత మాత జాతికి సేవ చేయడానికి పూనుకున్నారు. దేశ స్వాతంత్రo కోసం అయిన ఆధ్యాత్మికంగా ఎంతో సేవను అందించారు. అరభిందో యొక్క ప్రతిభను గుర్తించిన ఆంగ్లేయులు, అలిపోరు సంఘటనలో అరభిందో నీ జైలులో బంధించారు, ఆ సమయంలో ఆయన యోగ, ధ్యానం, ప్రాణాయామం పట్ల పట్టు సాధించారు. “దేవుడు ప్రత్యక్షంగా భూమి పై వ్యవహరించడు, తను చేయదాలుచుకున్న సాధనాలను కొందరు వ్యక్తుల చేత చేయిస్తాడు” అని అరభిందో మహర్షి చెబుతుండేవారు. అయినా రాసిన ” సావిత్రి: ది లెజెండ్ ఆఫ్ సింబల్” పుస్తకం నన్ను ఎంతో ప్రేరేపించింది. అరభిందో జీవితం ప్రతి భారత పౌరుడికి, ప్రపంచ దేశాలకు ఆదర్శమే. ఇలాంటి విశిష్ట కార్యక్రమంలో నేను భాగం అయినందుకు గర్వపడుతున్నాను.
జై హింద్!
– బానవత్ వినోద్ నాయక్.
Be the first to comment