
జియో…. ఇది టెలికాం రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిన సంస్థ.2016 లో తనయొక్క తొలి అడుగు వేసిన జియో, దేశంలో ఉన్న అన్ని టెలికాం సంస్థలకి ఒక షాక్ ని ఇచ్చింది.అప్పటి వరకు ఆకాశానికి ఉన్న డేటా,టాక్ టైం ఆఫర్లు జియో దెబ్బకి నేలకి వచ్చిన విషయం తెలిసిందే.మొదట తక్కువ ధరలకే అన్లిమిటెడ్ కాల్స్/డేటా లను ఇచ్చిన జియో ,డేటా వినియోగం పెరగటంతో లిమిటెడ్ డేటా ని చేసింది.
అయితే ఇది ఇలా ఉండగా ఊహించని విధంగా ట్రాయ్(TRAI) ఇచ్చిన రిపోర్టు ప్రకారం 2021 సెప్టెంబర్ లో మొదటిసారిగా 1.19 కోట్ల వినియోగ దారులని జియో కొల్పోయింది.అయితే తాజాగా ఎయిర్టెల్, వి లు తమ ప్రీపెయిడ్ ప్రణాళికలను 25% శాతం పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తమయొక్క నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులే లక్షంగా జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ని పెంచదు అనుకున్నవాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తు జియో కూడా వాటి దారీలోనే ధరలను పెంచి అందరిని ఆశ్చర్య పరిచింది. మిగితా వాటికంటే కొంత తక్కువ ధర ఉండటం కొంత ఊరటనిచ్చే విషయం.
దీనికి సంబంధించి అన్ని టెలికాం సంస్థలు,నెట్వర్క్ ఇంకా 5G స్పెక్ట్రమ్ ల పెట్టుబడి,కొనుగోళ్ల కొరకు లాభాలు పొందడానికి ప్రీపెయిడ్ ప్లాన్స్ ని పెంచాయన్నారు.అయితె పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు డిసెంబర్ 1 నుండి అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు.
K.Bharath(rachana college)
Be the first to comment