
*నటుడిగా 42 ఏళ్లు …..*
మహేష్ బాబు ఈ పేరు వింటేనే కుర్రకారులో హుషారు రేగుతుంది. ఈ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు.తాజాగా నటుడిగా తన కెరీర్ ప్రారంభించి 42 ఏళ్లు పూర్తిచేసుకున్న మహేష్ తన మొదటి సినిమా “నీడ” 1979లో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తన నాలుగో యేటనే నటించడం విశేషం.చైల్డ్ ఆర్టిస్ట్ గా కోడి రమ కృష్ణ సినిమా “పోరటం” తరవాత చాలా సినిమాల్లో మహేష్ బాబు నటించాడు.
1999 లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “రాజకుమారుడు” సినిమాలో మొట్ట మొదటిసారిగా హీరోగా ఆరంగ్రేటం చేశాడు మహేష్ బాబు.తన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్న మహేష్ తరువాత మురారి,ఒక్కడు,అతడు,పోకిరి,దూకుడు,బిజినెస్ మ్యాన్, సీతమ్మ వీక్కిట్లో సిరిమల్లె చెట్టు,భరత్ అనే నేను,మహర్షి, సరిలేరు నికెవ్వరులలో నటించాడు.ఇక తాజగా మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీలో 42 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా సోషల్ మీడియా లో తన అభిమానులు ట్రెండ్ ని సృష్టించారు.
ఇప్పుడు మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో నటిస్తున్న విషయం తెలిసిందే.
K.Bharath(rachana college)
Be the first to comment