రి”టెన్షన్”…..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL…మన దేశంలో క్రికెట్ ఒక మతం అయితే ఐపిల్ అనేది ఒక పండగ,అంటే T20 కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.ఈ 60 రోజుల పండగ సందడి ఏప్రిల్ లో ప్రారంభమై మే లో ముగుస్తుంది. అయితే ఈ సారి ఐపిల్ సీసన్ కొత్తగా ఉండబోతోంది.ఇదివరకు మొత్తం 8 జట్లు తలపడగా టీ20 క్రేజ్ ని మరింత పెంచడానికి BCCI మరొక 2 జట్లను (లక్నో, అహ్మదాబాద్) లను కలుపుతూ 10 జట్లుగా ప్రకటించింది.
ఈ సారి BCCI 2022 ఐపిల్ కోసం కొత్త నిబంధనలను తీసుకుంది.దీనిలో RTM కార్డ్ ని తీసేసి, దీనికిగాను ఒక్కొక్క జట్టు 4 ఆటగాళ్లు, వారిలో 2 భారతీయులు,2 విదేశీయులు లేక 3 భారతీయులు,1 విదేశీయులు ఉండే విదంగా వేసులు బాటును కల్పించింది. కొత్తగా వచ్చిన 2 జట్లకు వేలానికి ముందే ముగ్గురు ఆటగాళ్లను తీసుకునే అవకాశం కల్పించింది.
నవంబర్ 30 న జరిగిన రిటెన్షన్ లో ఆర్సీబీ విరాట్ కోహ్లీ, మాక్స్వెల్,సిరాజ్ లను, ఎమ్ఐ రోహిత్,బుమ్రా,సూర్య కుమార్,పొల్లార్డ్ లను,ఆర్ఆర్ సంజూ శాంసన్, జొస్ బట్లర్, యశస్వి జైశ్వాల్ లను,కేకేఆర్ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్,సునీల్ నరైన్ లను, డీసీ పంత్, అక్సర్ పటేల్,ప్రిథ్వీ ష, అన్ఱిచ్ నోకియా లను,సీ ఎస్ కె రవీంద్ర జడేజా,ధోనీ,మొయిన్ అలీ,రుతురాజ్ గైక్వాడ్ లను, ఎస్ ఆర్ హెచ్ కేనే విలియమ్సన్,అబ్దుల్ సమాద్,ఉమ్రాన్ మాలిక్ లను,పి బి కె యస్ మయాంక్ అగర్వాల్,అర్షిదీప్ సింగ్ లను రిటెన్షన్ చేసుకున్నారు.
అయితే మున్ముందు జరగబోయే వేలంలో మిగిలిన స్టార్ ఆటగాళ్లు ఏ జట్టు లోకి వెళ్తారన్నది ఉత్కంఠనంగా మారిన అంశం.
K.Bharath(rachana college)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*