
ఓ మీ క్రాన్ !
మళ్ళీ మొదలైన భయాందోళన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపిస్తుంది,దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు అందరిని హడలెత్తించిన సంగతి కరోనా వైరస్ ఎంతో మంది మనకి కావాల్సిన వారి ప్రాణాలను తీసింది.ఇప్పుడు మళ్లీ ఓమిక్రాన్ అని కొత్త వేరియంట్ రావడం కలకలం రేపుతుంది దీంతో ఆయా దేశాల్లో ఉన్న ప్రజలు భయపడుతున్నారు.భారత దేశంలో కూడా అది దాదాపు అడుగుపెట్టింది అని,ఈ మధ్యే ఒక వ్యక్తికి ఓమిక్రాన్ కరోనా పాజిటివ్ అని తేలింది.అంత అయిపోయింది అనుకుంటే మళ్ళీ మొదటికె వచ్చినట్టు ఏంటో ఇది అని ప్రతి ఒక్క సామాన్యుడు అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ మాస్క్ పెట్టుకోవడం జాగ్రత్తలు పాటించడం ఇవన్నీ తప్పవు.ప్రభుత్వం మాత్రం ముందు జాగ్రత్తగా మాస్క్ లేకపోతే వేయి రూపాయిల జరిమాన విధించింది,దాంతో ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది.ఈసారి దీన్ని అరికట్టాలి అంటే సాధ్యమైనంతవరకు మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప చేసే పని ఏమి లేదు.వైరస్ అనేది ఎప్పుడు ఎలా వ్యాపిస్తుందో చెప్పలేం కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే విషయం మరచిపోకూడదు. ఆరోగ్య సంస్థలు మాత్రం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు బహిరంగ ప్రదేశాల్లో, ప్రజా రవాణా లో మాస్క్ లు తప్పనిసరి అని ఆదేశించింది, ఎందుకంటే ఓమిక్రాన్ వైరస్ యొక్క తీవ్రత ఎలా ఉంటుందో ఇంకా ఖచ్చితంగా చెప్పలేము అన్నారు.
Kenna, Rachana Journalism College
Be the first to comment