
హైదరాబాద్: అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ గాయని, డాక్టర్ శోభారాజుకి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. “ఆటా వేడుకలు” సందర్భంగా రవీంద్ర భారతిలో హోంమంత్రి కిషన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆమెకు పురస్కారం అందజేశారు. అన్నమయ్య సంకీర్తనలకు వారు చేసిన సేవలకు గుర్తింపుగా అమెరికా తెలుగు సంఘం వారు జీవన సాఫల్య పురస్కారం ఇచ్చి గౌరవించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి కిషన్రెడ్డితో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఆటా అధ్యక్షుడు భువనేష్ భూజాల, ఆటా సభ్యులు పాల్గొన్నారు.
Be the first to comment