యువ తారల వినూత్న ప్రయత్నమే దక్ష

హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితులు ఎన్ని ఎదురైనా తమ వినూత్న ప్రయత్నాన్ని ఆపలేదని యువ దర్శకుడు వివేకానంద విక్రాంత్‌ తెలిపారు. విక్రాంత్‌ దర్శకత్యంలో సీనియర్‌ నటుడు శరత్‌బాబు తనయుడు ఆయుష్, నక్షత్ర, అను తారాగణంగా శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్‌ నిర్మాణ సారథ్యంలో ‘దక్ష’ పేరుతో సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ రూపుదిద్దుకుంది. మరికొద్ది రోజుల్లో వేసవి కానుకగా దక్ష సినిమా వెండితెరపైకి విడుదల కానుంది. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినిమా బృందం పాల్గొని సదడి చేసింది. ఈ సినిమా అరకులోని పలు అందమైన లొకేషన్‌లతో పాటు నగరంలోనూ షూటింగ్‌ చేశామని నిర్మాత తల్లాడ సాయి క్రిష్ణ తెలిపారు. ఇప్పటి వరకు తెలుగులో చూడని వినూత్నమైన సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందించామని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా వలన ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే లక్ష్యంతో తమ యువ బృందం నిరంతరం శ్రమిస్తుందని హీరో ఆయుష్‌ అన్నారు. ఈ నూతన సంవత్సరం దక్ష రూపంలో మంచి సక్సెస్‌ అందుకోబోతున్నామని సినీతారలు నక్షత్ర, అను తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*