
నిజామాబాద్: ప్రేమించే గుణం ఉంటే అసూయ ద్వేషాలకు తావుండదని నిజామాబాద్ రామకృష్ణ ఆశ్రమ నిర్వాహకులు సముద్రాల నరసింహాచార్యులు చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రేమతో మెదలాలని సూచించారు. ఇటీవల శివైక్యం చెందిన రామకృష్ణ ఆశ్రమ వ్యవస్థాపకులు స్వామి పూర్ణానంద స్మృతిలో నిజామాబాద్ గాయత్రీనగర్లోని రామకృష్ణ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వామి పూర్ణానంద బోధనలను గుర్తు చేశారు. సమాజానికి స్వామి పూర్ణానంద చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. శ్రీరామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద మార్గంలో నడిచేలా స్వామి పూర్ణానంద భక్తులకు నిరంతరం ప్రేరణనిచ్చారని చెప్పారు. కార్యక్రమంలో సముద్రాల కుటుంబీకులు, జ్యోతి, భూమేశ్వర్, బ్రహ్మచారిణి సమత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోనూ స్వామి పూర్ణానంద స్మృతిలో కార్యక్రమాలు జరిగాయి.
Be the first to comment