
సింగపూర్: ‘శుభకృత్’ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా, సింగపూర్‌లో తొలిసారిగా “శ్రీమద్ భాగవత సప్తాహం” నిర్వహించనున్నారు. సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’ ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో పంచ మహా సహస్రావధాని, అవధాన సామ్రాట్ డా. మేడసాని మోహన్‌తో వారం రోజుల పాటు భాగవత ప్రవచన సుధ నిర్వహిస్తారు. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకూ ఈ కార్యక్రమం ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. శని ఆదివారాల్లో 1:00pm SGT, 10:30pm IST సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 7:00pm SGT, 4:30pm IST వేళల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ & ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. భాగవత విశిష్టతను గురించి తెలుసుకొని, భగవంతుని కృపకు పాత్రులు కాగలరంటూ నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు. ప్రపంచం నలుమూలల్లో ఉన్న తెలుగు వారందరికీ సాదర ఆహ్వానం పంపుతున్నామని చెప్పారు.
Be the first to comment