హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి చేతులమీదుగా సీతారామచంద్ర స్వామి

www.eekshanam.com
హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి చేతులమీదుగా సీతారామచంద్ర స్వామి ధ్వజ ప్రతిష్ఠ
ప్రకాశం: అర్ధవీడు మండలం చెర్లోదొనకొండ గ్రామంలో సీతారామచంద్ర స్వామి ధ్వజ ప్రతిష్ఠ, గంగమ్మ, సింహవాహన, పోతురాజు, పోలేరమ్మ శిఖర కలశ ధ్వజ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. 13వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు గోపూజ, గంగపూజ, మహాగణపతి హోమం నిర్వహించారు. 14వ తేదీ ప్రాత:కాలపూజలు, మహామంగళహారతి ఇచ్చి తీర్థప్రసాద వితరణ చేశారు. 15వ తేదీ హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ప్రతిష్ఠోత్సవానికి విచ్చేస్తున్నారు. అదే రోజు ఉదయం ప్రాత:కాలపూజల అనంతరం 6.21 గంటలకు సీతారామస్వామి ధ్వజ ప్రతిష్ఠ, 7.32 గంటలకు గంగమ్మ సింహవాహన, పోతురాజు, పోలేరమ్మ, శిఖర ప్రతిష్ఠ చేయనున్నారు. ప్రతిష్ఠోత్సవాల్లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*