గర్భిణులకు ఆర్యజనని మార్గదర్శనం

www.eekshanam.com

హైదరాబాద్: గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని ఈ నెల 25, 26 తేదీల్లో ఇంగ్లీషులో వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఈ నెల 25న ఆఫ్‌లైన్, ఈ నెల 26న ఆన్‌లైన్ ద్వారా ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఈ వర్క్‌షాప్ జరగనుంది. ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ళ వయసు వచ్చే వరకు అంటే 1,000 రోజుల వరకు గర్భిణులు పాటించవలసిన సూచనలను గైనకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు ఈ వర్క్‌షాప్‌లో వివరిస్తారు.

ప్రసవానికి ముందు యోగా, గాఢమైన విశ్రాంతి, శ్వాసించడం, ధ్యానం వంటివాటికి సంబంధించిన శక్తిమంతమైన చిట్కాలను తెలియజేస్తారు. బిడ్డను పోషించడం, చనుబాలు ఇవ్వడం, శిశువుకు పోషకాహారం గురించి సమగ్ర సమాచారం ఇస్తారు. గర్భధారణ, మాతృత్వం గురించి ప్రయోజనకరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు నిపుణులతో మాట్లాడవచ్చునని, అనుభవజ్ఞులైన దంపతులు, తల్లులతో సంభాషించవచ్చునని ఆర్యజనని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమ ఇళ్ళ నుంచే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు www.aaryajanani.org ద్వారా చేసుకోవచ్చు. 9603906906 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*