కేన్సర్‌ అవగాహన పరుగు పోస్టర్‌ విడుదల చేసిన అక్కినేని అమల

హైదరాబాద్: కేన్సర్‌ వ్యాధిపై అవగాహన పెంచేందుకు గ్రేస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది అక్టోబర్ 9న రన్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ దస్‌పల్లా హోటల్‌లో అంతర్జాతీయ కేన్సర్‌ అవగాహన పరుగు పోస్టర్‌ను అక్కినేని అమల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనం మనల్ని తగినంతగా ప్రేమించుకోకపోవడం సరికాదన్నారు. అంతేకాదు పర్యావరణాన్ని ప్రేమించకపోవడంతో పాటు అన్నింటినీ నిర్లక్ష్యం చేయడమే కేన్సర్‌ విజృంభణకు కారణామని అమల చెప్పారు. ప్రతి ఒక్కరూ కేన్సర్‌పై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. కేన్సర్‌తో బాధపడుతూనే ఆసుపత్రి బెడ్‌పై నుంచే మనం సినిమాకు తమ మామ అక్కినేని నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు.  https://www.youtube.com/watch?v=FgCb7hsybuc

గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా 120కి పైగా దేశాల్లో క్యాన్సర్‌పై అవగాహన రన్ నిర్వహించబోతున్నామని గ్రేస్‌ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ చిన్నబాబు చెప్పారు.

కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ఫౌండేషన్‌ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్‌ ప్రమీలారాణి తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*