కన్నుల పండువగా నాట్యకల్ప 10వ వార్షికోత్సవం

హైదరాబాద్: నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి దశమ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని భారతీయ విద్యాభవన్ లో కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ లో శిక్షణ పొందిన కళాకారులు తమ నాట్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, పూజితా గౌడ్, సబిత భూమిడిపాటి, నాట్య గురువు లక్ష్మి ప్రసన్న, చావళి బాలత్రిపుర సుందరి, రమణి సిద్ధి, తదితరులు పాల్గొని కళాకారులను సత్కరించి అభినందించారు. నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి సంస్థ పదేళ్లుగా ఎంతో మందిని కళాకారులను తయారు చేయడం అభినందనీయమని నాట్యగురువు వెంపటి చినసత్యం కుమార్తెలు గురువు లక్ష్మి ప్రసన్నను ప్రశంసించారు. తమ తండ్రి కూడా 5 సంవత్సరాల చిన్నారులకు కూడా శాస్త్రీయ నృత్యం నేర్పించారని వారు గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*