పల్లెముచ్చట్లు మరో విజయం.. తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలో గెలుపు

విజయవాడ: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా మహిళల పట్ల దురాచారాలను తీవ్రంగా నిరసిస్తూ తెలుగు షార్ట్ ఫిల్మ్‌ అసోసియేషన్ ( TSFA) నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీల్లో పల్లెముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ‘వరకట్నం’ అంశంపై తీసిన ‘కట్నమా కాష్టమా’ షార్ట్ ఫిల్మ్ విజయం సాధించింది. విజయవాడలో ఆగస్టు 14,15న జరిగిన వేడుకల్లో సినీ నటులు, దర్శకులు శ్రీ కాశీ విశ్వనాధ్, సంగీత దర్శకులు R. P. పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. షార్ట్ ఫిల్మ్ విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందించారు. పల్లె ముచ్చట్లు దర్శకులు రేణికుంట సతీష్ ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.

“కొన్ని వందల షార్ట్ ఫిల్మ్స్ లో మా షార్ట్ ఫిల్మ్ విజయం సాధించడం ఆనందంగా ఉంది. కథలో బలం వుంటే విజయం మనదే అనటానికి మా చిత్రం నిదర్శనం. ఎందుకంటే మా చిత్రంలో సినిమా హంగులు ఏమి వుండవు .. కథ మాత్రమే నడిపిస్తుంది. కథకు వంద శాతం న్యాయం చేసే నా మిత్రులు వుంటారు .. వాళ్ళని నటులు అనలేను ఎందుకంటే వాళ్ళు నటించరు జీవిస్తారు. ఇలాంటి అవార్డ్స్ సాధించడానికి మా రైటర్ మంజీత కుమార్ అందించిన కథలే ముఖ్య కారణం. ఈ అవార్డు రచయిత్రి మంజీత మరియు ఈ షార్ట్ ఫిల్మ్ లో జీవించిన నా మిత్రబృందానికి అంకితం. ఇదే టీంతో మున్ముందు మరిన్ని విజయాలు అందుకుంటా అనే నమ్మకం ఇంకా ఇంకా బలపడింది”.

-పల్లె ముచ్చట్లు దర్శకులు రేణికుంట సతీష్

“సమిష్టి కృషివల్లే ఈ విజయం మా సొంతమయ్యింది. గతంలో మా అందరి కాంబినేషన్ లో వచ్చిన ‘రైతు బతుకు పోరాటం’ సూపర్ హిట్ అయ్యి హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రదర్శింపబడింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణగారి ప్రశంసలు అందుకున్నాము. ఇప్పుడు ఈ గెలుపు మాలో మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. సతీష్ దర్శకత్వ నైపుణ్యం, నటుల అద్భుతమైన నటన మాకు కొండంత బలం. ప్రేక్షకులు మమ్మల్ని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాము”

-కథ, మాటల రచయిత్రి మంజీత కుమార్

“ఈ షార్ట్ ఫిల్మ్ లో నాకు నటించే అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ సతీష్ కుమార్, ఇంత మంచి స్టోరీ ఇచ్చిన మా రైటర్ మంజీత కుమార్ గారికి, నా సహ నటులకు ధన్యవాదాలు”

-నటులు రామ్ బోగ

“మేము విజేతగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సతీష్ గారికి, ఇంత మంచి కథను అందించిన మంజీత గారికి, సహ నటులకు కృతజ్ఞతలు. ప్రేక్షకుల అభిమానం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని సందేశాత్మక లఘు చిత్రాలు మీకు అందిస్తామని హామీ ఇస్తున్నాము”

-నటి అమూల్య

“డైరెక్టర్ సతీష్ – రైటర్ మంజీత సూపర్ హిట్ కాంబినేషన్ అని మరోసారి రుజువైంది. ఎంపికైన 30 చిత్రాలలో మాది ఒకటి కావడం గర్వంగా ఉంది”

-నటులు మధు

“ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కథ చాలా బాగా రాసారు మంజీత గారు. సతీష్ సార్ డైరెక్షన్ గురించి చెప్పక్కర్లేదు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు”

-నటి సరిత

 

https://youtube.com/c/PalleMuchatlu

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*