మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

జగన్‌పై మంత్రి కామినేని సంచలన వ్యాఖ్యలు

Updated: 21-02-2018 02:41:45

అమరావతి: నీతికి, నిజాయితీకి ప్రతిరూపం మోదీ అయితే అవినీతికి, అరాచకానికి జగన్ ప్రతిరూపమని మంత్రి కామినేని తెలిపారు. 16 నెలలు జైల్లో ఉండి, 13 కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న జగన్‌తో కలిసే ప్రసక్తే లేదన్నారు. కేంద్ర నాయకత్వం కూడా జగన్‌తో కలిసి పనిచేయబోదన్నారు. రాష్ట్రంలో బిజెపి, టీడీపీ విడిపోతే లబ్దిపొందాలని కొందరు యత్నిస్తున్నారని కామినేని చెప్పారు. టీడీపీ, బిజెపి కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. భవిష్యత్‌లో వైసీపీతో బీజేపీ కలిసే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది తన వ్యక్తిగతమైన అభిప్రాయమని కూడా ఆయన చెప్పారు. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. 2019లో టీడీపీ, బిజెపి కలిసే ఎన్నికల్లోకి వెళ్తాయని చెప్పారు. కేంద్రం విడుదల చేసిన నిధుల విషయంలో పార్టీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు చెప్పింది కరెక్టేనన్నారు.  మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు.    

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.