మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: యనమల

Updated: 05-03-2018 01:03:04

అమరావతి: ఏపీలో బడ్జెట్ సమావేశాల వేళ ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఢిల్లీలో కాలుమోపారు. ఇవాళ ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమౌతారు. 2017 తర్వాత మిగతా రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా కొనసాగించబోమని చెప్పారని, అందుకే తాము ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పారు. అయితే హోదా ఉన్న రాష్ట్రాలకు గతంలో మాదిరిగానే నిధులు ఇస్తున్నారని, ఏపీకి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రాలేదని యనమల చెప్పారు.
 
మరోవైపు పార్లమెంట్‌ లోపలా బయటా ఏపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. 
 
అటు ఏపీ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని బిజెపి నేతలు చెబుతున్నారు. కొందరు కావాలనే బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని బిజెపి నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. వాస్తవాలు ప్రజలకు తెలిసేలా అన్ని వివరాలనూ సభ ముందుకు తెస్తామన్నారు. ప్రాజెక్టులు నిలిచిపోవడానికి కారకులెవరో ఆధారాలు చూపిస్తామన్నారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతోందని అసత్య ప్రచారమని బిజెపి నేత ఆకుల సత్యనారాయణ స్పష్టం చేశారు.
 
మొత్తం మీద ఈ నెల 28 వరకూ వాడీవేడిగా ఏపీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.