మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

తెలంగాణలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

Updated: 28-02-2018 07:17:00

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్లారిటీ ఇచ్చారు. అందరితో మాట్లాడి ఎవరితో పొత్తుపెట్టుకోవాలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ ఇప్పటికే ప్రకటించిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తు వద్దని టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.  పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు. అంతేకాదు.. తెలంగాణలో టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. పార్టీని విలీనం చేసే హక్కు ఎవరికీ లేదని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఎల్లకాలం ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకున్న అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.