మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

శ్రీదేవి ఇక లేరు.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ

Updated: 25-02-2018 08:31:58

చెన్నై: నటి శ్రీదేవి (54) దుబాయ్‌లో హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు. నటుడు మోహిత్ మర్వా వివాహం కోసం భర్త బోనీ కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఓ సినిమా షూటింగ్ ఉండటంతో ఆమె కుమార్తె జాన్వి దుబాయ్ వెళ్లలేదు. శ్రీదేవి ఇక లేరనే వార్తతో భారత సినీ రంగం మూగబోయింది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీదేవి అంటే ఇష్టపడనివారుండరు. అందంతో పాటు అద్భుతమైన అభినయం ఆమె సొంతం. శ్రీదేవి 1963 ఆగస్ట్ 13న తమిళనాడులోని శివకాశిలో పుట్టారు. 1975లో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ హిందీ తదితర భాషల్లో వందలాది సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున తదితర అగ్రహీరోలందరి సరసన ఆమె నటించారు. 1996లో నిర్మాత బోనీ కపూర్‌తో ఆమెకు వివాహమైంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. 
 
తన జీవితం నుంచి గొప్ప వెలుగును తీసుకెళ్లిపోయిన భగవంతుడంటే తనకు అసహ్యమని వర్మ ట్వీట్ చేశారు.
 
శ్రీదేవి కన్నుమూతతో తాను షాక్‌నకు గురయ్యానని రజినీకాంత్ చెప్పారు. తాను మంచి ఫ్రెండ్‌ను కోల్పోయానన్నారు. సినీరంగం ఒక లెజెండ్‌ను కోల్పోయిందని చెప్పారు. ఆమె ఆత్మక శాంతి కలగాలని ప్రార్ధించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.   

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.