మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ

Updated: 01-02-2018 07:25:45

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు హరిబాబు, కిషన్ రెడ్డి సహా ఇతర నేతలకు అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో ఇరు రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఏపీ అధ్యక్షుడు హరిబాబు, శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు, సీనియర్ నేత పురంధేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి, సీనియర్ నేత దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తదితరులు నేడు అమిత్ షాతో భేటీ కానున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో వైరం, అసెంబ్లీ సీట్ల పెంపు, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చర్చించనున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు వల్ల అధికార టీఆర్ఎస్ లాభపడే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో విభజన సమస్యలు, బీటలు వారుతున్న బీజేపీ-టీడీపీ స్నేహంపై  చర్చించనున్నట్టు తెలుస్తోంది.  
--------------

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.