మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

తెలుగువాడైన జీవీఎల్‌కు జాక్‌పాట్...

Updated: 11-03-2018 09:48:47

న్యూఢిల్లీ: బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుకు జాక్‌పాట్ తగిలింది. పార్టీ ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి జీవీఎల్‌ను రాజ్యసభకు ఎంపిక చేసింది. తెలుగువారైన జీవీఎల్ జాతీయ స్థాయిలో టీవీ ఛానెళ్లలో బిజెపి తరపున చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్నారు. యూపీ నుంచి రాజ్యసభకు మొత్తం ఏడుగురిని ఎంపిక చేయగా వీరిలో జీవీఎల్ పేరు కూడా ఉంది. మొత్తం 18 మంది అభ్యర్ధులతో బిజెపి నేడు జాబితా విడుదల చేసింది. కేంద్ర కేబినెట్‌లో తెలుగువారికి చోటు లేకపోవడంతో జీవీఎల్‌ను కేంద్ర మంత్రి పదవి వరించే అవకాశం ఉందని సమాచారం.  

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.